మగధీర' సినిమాను చూసినప్పుడు అందులో నన్ను నేను చూసుకున్నా. ఇప్పుడు 'బద్రినాథ్'ను చూస్తుంటే కూడా అదే ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా 'మగధీర'కు దీటుగా ఆడుతుంది అంటూ బద్రీనాధ్ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి చేసిన ప్రసంగంలోని వాక్యాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో టాపక్ గా మారాయి. ఎంతసేపు తన కుమారుడు చేసిన 'మగధీర'కు ధీటుగా ఆడుతుంది అనటమే కానీ...మగధీర కన్నా చాలా బాగా గొప్పగా ఆడుతుంది అని అనలేదే అంటున్నారు.అంటే ఎప్పటికీ 'మగధీర' పోలుస్తారా అంటున్నారు. నిజానికి చిరంజీవి చాల క్యాజువల్ గా అన్న మాటలకు విపరీతమైన అర్దాలు తీస్తున్నారు. అలాగే ఆయన సీఎం చేద్దాంలే అంటూ ఇదే సభలో అన్న మాటను కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే సమయంలో... "మగధీర, బద్రినాథ్‌లాంటి చిత్రాలను నేను చేయలేకపోయానే అనే బాధ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. చిన్నికృష్ణ ఎంతో శ్రమించి కథ అందించారు. దర్శకుడు వి.వి.నాయక్ నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎంతో తపన ఉన్న దర్శకుడు ఆయన. సినిమాను తీయడానికి ఎంతో కష్టపడుతున్న దర్శకుల్లో వి.వి. వినాయక్, రాజమౌళి పేర్లను చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇండస్ట్రీ మనగలుగుతోంది అంటే ఇలాంటి దర్శకులు ఉండబట్టే అన్నారు. అయితే చిరంజీవి పాజిటివ్ గా చెప్పిన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అదీ సంగతి.
English summary
The audio of director VV Vinayak's ongoing Allu Arjun-Tamanna starrer Badrinath will be released.Badrinath is a complete action film, starring Allu Arjun as an Indian samurai. He took some special training in Vietnam for this role in Badrinath. Story is by Chinni Krishna, while S. Ravi Varman handles the camera.
0 comments:
Post a Comment